calender_icon.png 23 July, 2025 | 11:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘స్థానిక’ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలి

23-07-2025 01:07:23 AM

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు

చేవెళ్ల, జులై 22:స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పిలుపునిచ్చా రు. మంగళవారం చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రా మానికి చెందిన పలువురు నాయకులు బీఆర్ ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనపురం శశిపాల్, చేవెళ్ల మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గోనె కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో హరీశ్ రావును కలిశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం గట్టిగా పనిచేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని సూచించారు. కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు శేరి రాజు, మహమ్మద్ ఆరిఫ్, గోనె మాధవ రెడ్డి , బేగరి శివకుమార్, సాయి కిరణ్ రెడ్డి(చింటు), జూకంటి సురేశ్, బేగరి నందు, కుమ్మరి శ్రీకాంత్, ఊరడి రజిని కాంత్, బేగరి శ్రీకాంత్(పండు) , కల్యాణ్ తదితరులుపాల్గొన్నారు