calender_icon.png 23 July, 2025 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పథకాల్లో కోతలు.. ఉద్యోగులకు వాతలు

23-07-2025 01:06:23 AM

- హోంగార్డులకు వెంటనే వేతనాలు చెల్లించాలి

- మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాల్లో కోతలు విధిస్తూ, ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా వాతలు పెడుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశా రు. రాష్ట్రంలోని హోగార్డులకు జీతాలకు రాక ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. నెల మొదలై 22 రోజు లు గడస్తున్నా హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటని విమర్శించా రు.

వెంటనే హోంగార్డుల కు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా కేంద్ర ఆర్థిక మంత్రి లోక్‌సభలో తెలంగాణ తలసరి ఆదాయంపై ఈ నెల 21న సమాధానమిస్తూ 2013 నుంచి 2023- వరకు తెలంగాణ రాష్ర్టం తలసరి ఆదాయంలో 84.3 శాతం వృద్ధి సాధించిందని తెలిపారని, కేసీఆర్ పాలనలో తలసరి ఆదాయంలో తెలంగాణ దూసుకెళ్లిందని హరీశ్‌రావు అన్నారు. ఇందుకు కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలు ప్రధాన కారణాలని చెప్పారు.