27-01-2026 12:00:00 AM
పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి పిలుపు
కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 26(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మున్సిపాలిటీ లో గులాబీ జెండా ఎగరవేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని ఎమ్మార్పీఎస్ నాయకుడు ఇప్ప నాగరాజు ఆధ్వర్యంలో జనకాపూర్ కు చెందిన పలువురు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.వారికి గులాబీ కండ వా కప్పి కోవలక్ష్మి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో 20 వార్డులలో బిఆర్‌ఎస్ కు చెందిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగల్ విండో మాజీ చైర్మన్ అలీబిన్ హైమద్,మాజీ సర్పంచ్ మర్సు కోల సరస్వతి, పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్, ఏఎంసీ మాజీ చైర్మన్ లు గంధం శ్రీనివాస్, చిలువేరు వెంకన్న,నాయకులు పొన్నాల నారాయణ, దూడల అశోక్, నిసర్ ,పోశన్న, సాలమ్మ, చంద్రకళ ,చిన్నక్క ,మురళి, ప్రభాకర్, భీమేష్ ,భీమయ్య తదితరులు పాల్గొన్నారు.