calender_icon.png 27 January, 2026 | 9:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటో డ్రైవర్లకు ‘ఆత్మీయ భరోసా’

27-01-2026 12:00:00 AM

ఖానాపూర్ బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్య జాన్సన్ నాయక్ 

ఖానాపూర్, జనవరి ౨౬ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో ఉన్న ఆటో డ్రైవర్లకు ఎల్లవేళలా అండగా ఉంటానని అధైర్య పడవద్దు అని డ్రైవర్లకు ‘ఆత్మీయ భరోసా’ క్రింద జీవిత బీమా చేస్తున్నామని ఖానాపూర్ బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్య జాన్సన్ నాయ క్ అన్నారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సోమవారం నియోజకవర్గ కేంద్రం ఖానాపూర్‌లో ఆటో డ్రైవర్లకు ఆత్మీయ భరోసా పేరున ప్రతి ఒక్క కుటుంబానికి రూ.5 లక్షలు న్యూ ఇండి యా ఇన్సూరెన్స్‌లో గ్రూప్ ఇన్సూరెన్స్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు తాళ్లపల్లి రాజ గంగన్న, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సకారం శ్రీనివాస్, కొక్కుల ప్రదీప్ గౌరీకర్ రాజు, డాక్టర్ కేహెచ్ కాన్, తోట సుమిత్, దివాకర్, బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.