20-07-2025 12:00:00 AM
హైదరాబాద్, జూలై 19: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కు బయల్దేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం శనివారం ఉదయం టేకాఫ్ అయిన కాసేపటికే హైదరాబాద్‌కు తిరిగొచ్చింది. బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం షెడ్యూల్ కంటే 20 నిమిషాలు ఆలస్యంగా ఉదయం 6.40 గంటలకు బయల్దేరింది.
ఈ విమానం థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కు ఉదయం 11.45 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే సాంకేతిక సమస్యకు కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ఇటీవలి కాలంలో విమానాలు తరచూ సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటుండటం ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తోంది.