15-12-2025 12:20:51 AM
మెదక్ జిల్లాలో 88.80 శాతం పోలింగ్
మనోహరాబాద్ మండలం కోనాయిపల్లి పీటీలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఘర్షణ
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజాప్రతినిధులు
సంగారెడ్డి / మెదక్, డిసెంబర్ 14(విజయక్రాంతి):రెండవ విడత గ్రామ పంచాయ తీ ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని 371 గ్రామ పంచాయతీలకు, 2,977 వార్డులకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఇప్పటికే రెండు జిల్లాల్లో 21 సర్పంచ్ స్థానాలు, 476 వార్డులు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. రెండు జిల్లాల్లో రెండవ విడత ఎన్నికల సందర్భంగా ఎలాంటి అ వాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగిశాయి.
అయితే మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కోనాయిపల్లి పీటీ గ్రామంలో కాంగ్రెస్, బీజేపీ వర్గీ యుల మధ్య వాగ్వివాదం జరిగి ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు ఒకరిపై ఒక రు దాడులు చేసుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెద రగొట్టారు.
అలాగే మెదక్ జిల్లాలోని చేగుం ట మండలం గొల్లపల్లి గ్రామ బీఆర్‌ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిని సబిత భర్త జనా ర్ధన్రెడ్డి శనివారం రాత్రి నుండి కనిపించక పోవడంతో ఆందోళన వ్యక్తమైంది. దీంతో తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్ నేతృత్వంలో వెతకడంతో ఆదివారం అతని ఆచూకి లభించింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకు న్నారు. కాగా ఉద్దేశపూర్వకంగానే జనార్ధన్రెడ్డి నాటకమాడారని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో 82.75 శాతం నమోదు..
సంగారెడ్డి జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆందోల్, చౌటకూర్, ఝరాసంగం, కోహీర్, మొగుడంపల్లి, మునిపల్లి, పుల్కల్, రాయికోడ్, వట్పల్లి, జహీరా బాద్ మండలాల్లోని 243 గ్రామ పంచాయతీలు, 2,163 వార్డులు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 14 సర్పంచ్లు, 222 వార్డులు ఏక్రగీవం కావడంతో మిగిలిన 229 సర్పంచ్, 1,941 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు.
ఆదివారం ఉదయం నుండి మందకొడిగా సాగిన పోలింగ్ ఒక్కసారిగా పుంజుకుంది. ఉదయం 9 గంటల వరకు 24.66 శాతం న మోదు కాగా, ఉదయం 11 గంటలకు 59.87 శాతం, మధ్యాహ్నం 1 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి 82.75 శాతం నమోదైంది. జిల్లాలో రెండో విడతకు 2,99,578 ఓటర్లకు గాను 2,47,911 ఓట్లు పోలయ్యా యి. ఈ దఫాలో మునిపల్లి మండలంలో అత్యధికంగా 88.44 శాతం నమోదైంది.
మెదక్ జిల్లాలో 88.80 శాతం పోలింగ్...
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మెదక్ జిల్లాలోని 8 మండలాల్లో ఎన్నిక జరిగింది. జిల్లాలోని చేగుంట, మనోహరాబాద్, మెదక్, నార్సింగి, నిజాంపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట, తూప్రాన్ మండలాల్లోని 149 పంచాయతీలు, 1,290 వార్డులు ఉండగా ఇందులో 7 సర్పంచ్ స్థానాలు, 254 వార్డులు ఏక్రగీవం అయ్యాయి. దీంతో మిగిలిన 142 సర్పంచ్, 1,036 వార్డులకు ఎన్నికలు జరిగాయి.
రెండో విడత మండలాల్లో 1,72,656 మంది ఓటర్లు ఉండగా 1,53,313 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటలకు 21.83 శాతం, ఉదయం 11 గంటలకు 59.26 శాతం, పోలింగ్ ముగిసే సమయానికి 88.80 శాతం నమోదైంది. ఇలావుండగా చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లిలో మెదక్ ఎమ్మెల్యే దంపతులు మైనంపల్లి రోహిత్రావు, శివానీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే రామాయంపేట మండలం కోనాపూర్లో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కుటుం బం ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా మెదక్ మండలంలో 91.64 శాతం ఓటింగ్ నమోదైంది.
ఓటు వేయని మాజీ సీఎం కేసీఆర్
సిద్దిపేట, డిసెంబర్ 14 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు పోలీసు బందోబస్తు మధ్య ఆదివారం ప్రశాంతంగా ముగిసాయి. అక్బర్ పేట భూంపల్లి, మిరుదొడ్డి, దుబ్బాక, సిద్దిపేట రూరల్, సిద్దిపేట అర్బన్, చిన్నకోడూ రు, బెజ్జంకి, నంగునూరు, తొగుట, నారాయణరావుపేట మండలాలలోనీ 182 గ్రామ పంచాయతీలు, 1644 వార్డులకు ఎన్నికలు జరిగాయి.
ఓటు అపహస్యం..
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి పౌరుడు వినియోగించుకోవడం అంటే రాజ్యాంగం కల్పించిన హక్కులను గౌరవించడమేననేది స్పష్టమవుతుంది. కానీ ఓట్లతో నే రాజకీయం చేసే నేతలు ఓటు హక్కు వినియోగించుకోకపోవడం రాజ్యాంగ హక్కును అపహస్యం చేసినట్లేననేది తెలుస్తుంది. మాజీ సీఎం కే. చంద్రశేఖర రావు స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోకపోవడం రాజ్యాంగ విలువలను అగౌరపరచడమేనని రాజకీయ విశ్లేషకులు విమర్శలు చేస్తున్నారు.
ఎమ్మెల్యే ఎన్నికలకు మాత్రమే తన స్వగ్రామమైన సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామానికి వచ్చి ఓటు వేస్తారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలలో మాత్రం ఓటు వేయరని అందుకు తన కుటుంబీకులు లేదా తన కులస్తులు పోటీ చేయకపోవడమే కెసిఆర్ ఓటు వేయకపోవడానికి ప్రధానమైన కారణమంటూ గ్రామస్తులు విమర్శిస్తున్నారు.
బొప్పాపూర్ లో...
మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక మండలం బొప్పాపూర్ గ్రామంలో తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే బాలకిషన్ బెజ్జంకి మండల పరిధిలో నివాసముంటున్నప్పటికీ తిమ్మాపూర్ మండలంలో ఆయన ఓటు నమో చేసుకున్నట్లు తెలుస్తుంది.
88.36 శాతం ...
సిద్దిపేట జిల్లాలో మొదటి విడతలో జరిగిన ఎన్నికలలో 88.05 శాతం ఓట్లు నమో దు కాగా రెండవ విడతలో 88.36శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ నెల 17 నాడు మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. అందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పా ట్లు చేస్తున్నారు.