calender_icon.png 25 August, 2025 | 10:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదవాడి సొంతింటి కల నెరవేరుతుంది

25-08-2025 12:41:30 AM

- ఇందిరమ్మ మోడల్ గృహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ 

హన్వాడ ఆగస్టు 24 : మండలం తహశీల్దార్ ప్రాంగణంలో గృహ నిర్మాణ శాఖ రూ 5 లక్షల వ్యయంతో నిర్మాణం చేసిన ఇందిరమ్మ మోడల్ గృహం కం గృహ నిర్మాణ ఏఈ కార్యాలయం ను మహబూబ్ నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు స్వంత ఇంటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ గృహాలను నిర్మాణం చేసేందుకు లబ్ధిదారులకు రూ 5 లక్షలు ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.

నూతన టెక్నాలజీ తో 5 లక్షల వ్యయంతో ఆకర్షణీయంగా మోడల్ హౌజ్ ను నిర్మాణం చేసినట్లు తెలిపారు.ఈ మోడల్ హౌజ్ నిర్మాణం చేసిన గృహ నిర్మాణ పి.డి.,సిబ్బందిని ఎమ్మెల్యే,ప్రజా ప్రతినిధులు అభినందించారు.లబ్ధిదారులు గృహ నిర్మాణ అధికారులు సూచించిన మోడల్ లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసుకుని ఖర్చు అనవసర వ్యయం తగ్గించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారి వైద్యం భాస్కర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, ఎంపీడీఓ యశోద, తహశీల్దార్ కిష్టా నాయక్ తదితరులు పాల్గొన్నారు.