25-08-2025 12:42:50 AM
కాలనీలో తీవ్ర నీటి ఎద్దడి
అలంపూర్, ఆగస్టు 24: వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామచంద్రనగర్ 9వ వార్డులో త్రాగునీరు రాక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ కాలనీలో ప్రధానంగా అత్యధికంగా దళితులు నివసిస్తుండడం వల్లే అధికారులు చిన్న చూపు చూస్తున్నట్లు స్పష్టమవుతుందని బిజెపి నాయకులు మండిపడ్డారు.
ఆదివారం 9వ వార్డులో వారు పర్యటించి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ముఖ్యంగా మిషన్ భగీరథ నీళ్లు సరిగా రావడం లేదని త్రాగడానికి నిత్యవసరాలకు మనిషి చనిపోయిన తర్వాత స్నానం చేయడానికి కూడా నీళ్లు లేక అవస్థలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అధికారులకు ఎన్ని మార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని కాలనీవాసులు వాపోయారు.
దయచేసి త్రాగునీరుకు శాశ్వత పరిష్కారం చూపాలని లేదంటే మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తామన్నారు.గతంలో పలు వార్డులు వారిగా సమస్యలు పరిష్కాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ కు పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బోయ నాగరాజు, బోయ వెంకటేశ్వర్లు సంజన మోహన్ యాదవ్ ,శేఖర్ ఆచారి, అశోక్ కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.