calender_icon.png 4 August, 2025 | 1:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ కార్డుతో పేదలు సంక్షేమ పథకాలకుసద్వినియోగం చేసుకోవాలి

31-07-2025 12:59:41 AM

- ఎన్నో ఏళ్లుగా రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారి కలను సాకారం చేసిన ప్రజా ప్రభుత్వం

- వనపర్తి పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: ఎమ్మెల్యే మెఘా రెడ్డి

వనపర్తి టౌన్, జూలై 30: గత ప్రభుత్వం పదేళ్లుగా ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఇపుడు అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేసి సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు తో కలిసి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా  హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన రేషన్ కార్డు లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా రేషన్ కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేళ్లుగా ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఇపుడు అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేసి సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.  ప్రజా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 6 గ్యారంటీలను అమలు చేస్తోందని తెలిపారు. ఇప్పుడు వనపర్తి పట్టణ పరిధిలో పదిహేను వేల మందికి లబ్ధి చేకూర్చే విధంగా  కొత్త రేషన్ కార్డులను పంపిణీ కార్యక్రమానికి ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.

గత ప్రభుత్వం దాదాపు 10 ఏళ్లపాటు రేషన్ కార్డులను ఇవ్వడం విస్మరించిందని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వంలో రేషన్ కార్డుల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ అని దీనికి లాస్ట్ డేట్ అనేది లేదని ఎప్పుడైనా అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వ పథకాలను పొందడానికి సులువు అవుతుందని, కాబట్టి పేదలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిచ్చారెడ్డి, పుట్టపాకుల మహేష్, జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, తహసిల్దార్ రమేష్ రెడ్డి, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.