31-07-2025 12:59:04 AM
జనగామ, జులై 30 (విజయ క్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు నిర్మాణాలను మొదలు పెట్టాలి.. మున్సిపల్ కార్య కలాపాలు విస్తృత పరచాలి. బుధవారం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)పింకేష్ కుమార్ స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో పర్యటించి చేయూత పెన్షన్స్ లో సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు చేపడుతున్న ముఖచిత్రంతో గుర్తింపు కార్యక్రమా న్ని స్వయంగా పరిశీలించారు.
అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు తో సమావేశం నిర్వహించి మున్సిపల్ కార్యకలా పాలను సమీక్షించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు ఇండ్ల నిర్మాణాలు వెంటనే చేపట్టాలన్నారు.లబ్దిదారులు మహిళా సంఘాల లో సభ్యులను ఇండ్ల నిర్మాణాలు చేపట్టే విధంగా ప్రోత్సహించాలన్నారు. చేయూత ఫెన్షన్ లబ్దిదారులు ఆందోళన చెందరాదన్నారు. పెన్షన్లలోని వస్తున్న సాంకేతిక సమ స్యలను తప్పనిసరిగా పరిష్కరిస్తామన్నారు.
మున్సిపల్ ఆదాయం పెంచేందుకు ప్రణాళిక పరంగా ముందుకు వెళ్లాలన్నారు. పారి శుద్ధ్య పనులు చేపడుతూ సీజనల్ వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమి షనర్ రాధాకృష్ణ, హౌసింగ్ ఇంజనీరింగ్ అధికారులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.