24-05-2025 12:00:00 AM
కందుకూరు ఎంపీడీవో సరిత
కందుకూరు,మే 23 :పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన ప్రతి ఒక్కరు ఇండ్లు నిర్మించుకొని మీ కలలను సహకారం చేసుకోవాలని కందుకూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి సరిత సూచించారు.శుక్రవారం కందుకూరు మండల పరిధిలోని దెబ్బడగూడ గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ ఏనుగుల శ్రావణి జంగారెడ్డిలతో కలసి ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ఇల్లు నిర్మించాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారని అందుకు లబ్ధిదారులు పూర్తిగా సహకరించారని ఆమె తెలిపారు.ఎస్సీ, ఎస్టీలకు ఇంటి నిర్మాణానికి 6 లక్షలు బీసీలకు ఇతరులకు ఐదు లక్షల రూ పాయలు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని ఆమె పేర్కొన్నారు.
ఇట్టి ఇందిరమ్మ ఇళ్లకు ఈనెల 25 వరకు పనులు ప్రారంభించాలని ఆమె అన్నారు. కొత్తగూడలో ఇందిరమ్మ లబ్ధిదారులతో అవగాహన సదస్సును నిర్వహించారు.ఈ అవగాహన సదస్సులో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు గ్రామ కార్యదర్శి,ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి ఆమె అందజేశారు.
ఈ కార్యక్రమంలో మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణా నాయక్,జిల్లా గ్రంధాల సంస్థ మాజీ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి,కందుకూరు మండల మాజీ జెడ్పిటిసి ఏనుగు జంగారెడ్డి, దెబ్బడగూడ గ్రామ కార్యదర్శి శ్రీహరి, కొత్తగూడ గ్రామ కార్యదర్శి ఉమాదేవి, దెబ్బడగూడ ఇందిరమ్మ కమిటీ సభ్యులు నీలం వెంకటేష్,మల్లెపల్లె ప్రభాకర్,గాదే యాదగిరి,డేరంగుల వసంత,మాజీ కో- ఆప్షన్ సభ్యులు సులేమాన్,పిఎసిఎస్ డైరెక్టర్ టి.జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి,బొడ్డు బాల్ రెడ్డి,ఎండి.వహీద్,కొత్తగూడ ఇందిరమ్మ కమిటీ సభ్యులు బొక్క సంజీవరెడ్డి,సౌదపు శేఖర్ గౌడ్,కుమ్మరి కృష్ణయ్య, ఎండి. ఖధీర్, కాంగ్రెస్ నాయకులు బొక్క భూపాల్ రెడ్డి,దామోదర్ రెడ్డి, నరేందర్ రెడ్డి,దేవేందర్ రెడ్డి,లక్ష్మీపతి గౌడ్, అంగన్వాడీ టీచర్ తల్లోజు సరస్వతి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.