24-05-2025 12:00:00 AM
వారసిగూడ, మే 23 (విజయక్రాంతి) : బౌద్ధనగర్ బిజెపి అధ్యక్షుడు సాయి ప్రసాద్ గౌడ్ ఆపరేషన్ సిందూర్* విజయవంతమైన సందర్భంగా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరియు త్రివిధ దళాలకు సెల్యూట్ చేస్తూ వారికి సంఘీభావంగా సాయి ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో బౌద్ధనగర్ డివిజన్ పార్సిగుట్ట నుండి తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది.
యుద్ధంలో మరణించిన సైనికులకు నివాళులు అర్పిస్తూ, పాకిస్తాన్ ఉగ్రవాదులకు తగిన రీతిలో బుద్ధి చెప్పి ప్రపంచ దేశాల మన్ననలను పొందిన మన సైనిక సిబ్బందికి.మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలియజే స్తూ సెల్యూట్ ఫర్ ఆర్మీ కార్యక్రమం లో భాగంగా పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని బౌద్ధనగర్ డివిజన్ కు సంబంధించి సంఘీభావంగా అన్ని వర్గాల ప్రజలు యువత మహిళలు పలు సంఘాలు కార్మికులు స్వచ్ఛంద సంస్థ లు కాలనీ అసోసియేషన్స్ వారు పాల్గొన డం జరిగిందని సాయి ప్రసాద్ గౌడ్ తెలిపారు.
దేశ రక్షణలో మేము సైతం సిద్ధమ ని ముందుకు వచ్చి ఈరోజు సాయంత్రం పార్సిగుట్ట సున్నం బట్టి నరేంద్ర బుక్ షాప్ నుండి పార్సిగుట్ట చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వరకు వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పిస్తూ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగిందని డివిజన్ బిజెపి అధ్యక్షులు సాయి ప్రసాద్ గౌడ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ అధ్యక్షుడు నేతి సత్య నారాయణ. విఎస్ రాజు. దత్తు. లడ్డు. చైత న్య. సంపత్ శ్యామ్ సినిమా రాజు సతీష్ నేత పాండు గజరాజు పాల్ నీలెస్ నాగరాజు ప్రమోద్ సురేష్ అమరావతి సుశీల వెంకటేష్ ముదిరాజ్ ఉమాపతి దీపక్ జయంత్ బాలయ్య రూప్ సాయి రాజ్ కుమార్ నేత బిక్షపతి తదితర బస్తీ వాసులు పాల్గొన్నారు.