calender_icon.png 24 May, 2025 | 11:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతదేహాలను కుటుంబాలకు అప్పగించాలి

24-05-2025 12:00:00 AM

-కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అమరుల బంధు మిత్రుల సంఘం

ముషీరాబాద్, మే 23 (విజయ క్రాంతి) : ఈనెల 21న నారాయణపూర్ ఎన్ కౌంటర్ లో అమరులైన మావోయిస్టుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని అమరుల బంధు మిత్రుల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షులు భవాని, పౌర హక్కుల సంఘం నేతలు ఎన్.నారాయణ రావు, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ఐఎఫ్టీవీ అనురాధ లు మాట్లాడుతూ మావోయిస్టు మృతదేహాల పట్ల ఉన్మాదంగా, అవమాననీయంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును వారు తీవ్రంగా ఖండించారు.

సీపీఐ మావోయిస్టు కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావు మృతదేహాన్ని రక్త సంబంధీకులకు ఇవ్వకుండా ఛత్తీస్గడ్ పోలీసులు వేధించడం రాజ్యాంగం వ్యతిరేకమని వారు అన్నారు. మావోయిస్టు పార్టీతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధం కావాలని వారు సూచించారు.

ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పోలీసులు, దేశ సరిహద్దులోని సైనిక బలగాలను కూడా ఆదివాసీ ప్రాంతాల్లో లక్షలాదిగా మోహరించి హెలికాప్టర్లు, డ్రోన్లు, రాకెట్ లాంచర్లతో హత్యాకాం డకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు.  కేంద్ర ప్ర భుత్వం తక్షణమే మావోయిస్టులతో శాంతి చర్చలకు జరపాలని డిమాండ్ చేశారు.