21-10-2025 07:26:35 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): కాంగ్రెస్ అధిష్టానం ప్రజల అభిప్రాయాలను, కష్టకాలంలో పార్టీని కాపాడిన నాయకుల పనితీరును దృష్టిలో పెట్టుకొని డీసీసీ పదవికి అధ్యక్షుడిని ఖరారు చేయాలని బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ గౌస్ భాయ్, నాయకులు షకీల్ బాయ్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తొంగల, ఆడెపు మహేష్, మహమ్మద్ అస్లం, గుంపుల శంకర్, అచ్చశివ, బూట్ల వెంకటలక్ష్మిలు కోరుతున్నారు. అధిష్టానం డీసీసీ పదవి కోసం అభ్యర్థుల దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలించాలని కోరారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే దంపతులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, సురేఖలు పార్టీలో నైరశ్యానికి గురైన విద్యార్థులు, రైతులు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపి జిల్లాలో కాంగ్రెస్ జెండాను ఎగరేసిన విషయాన్ని అధిష్టానం పరిశీలనలోకి తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఇంద్రవెల్లి సభను కొక్కిరాల దంపతులు దిగ్విజయం చేసిన విషయాన్ని పార్టీ పెద్దలు పునరాలోచించాలని వారు కోరారు.