21-10-2025 07:22:32 PM
తుంగతుర్తి లయన్స్ క్లబ్ అధ్యక్షులు పాలవరపు సంతోష్..
తుంగతుర్తి (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించినప్పుడే ఉన్నతమైన ఉద్యోగాలు పొందగలుగుతారని తుంగతుర్తి లయన్స్ క్లబ్ అధ్యక్షులు పాలవరపు సంతోష్ అన్నారు. సూర్యాపేట జిల్లా లయన్స్ క్లబ్బు రీజియన్ ఛైర్పర్సన్ కొండ సంతోష్ జన్మదినం సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి జక్కు శ్రీకర్, రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలో గెలిచి, అవార్డు ప్రశంసా పత్రం సాధించాడు. దీనితో తుంగతుర్తి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శాలువాతో తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
భవిష్యత్తులో క్లబ్బు ఆధ్వర్యంలో శ్రీకర్కు అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి విద్యార్థి క్రీడల్లో రాణించుటకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు తల్లాడి కేదారి, కోశాధికారి గుండా గాని రాము, క్లబ్ కోఆర్డినేటర్లు ఓరుగంటి శ్రీనివాస్, సుభాష్, పులుసు వెంకటనారాయణ, ఎనగందుల గిరి ఎనగందుల సంజీవ, పిడి యాకయ్య, రమేష్, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.