15 April, 2026 | 8:04 AM

సనాతనధర్మం శక్తిని అఖండ2లో చూస్తారు

16-11-2025 12:00 AM

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న డివైన్ యాక్షన్ చిత్రం ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం తేజస్విని నందమూరి సమర్పకురాలు. సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ఓ శక్తిమంతమైన పాత్రను పోషిస్తున్నారు. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు.

డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమా నుంచి మొదటి గీతం ‘ది తాండవం’ను ముంబై ఈవెంట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. “50 ఏళ్లుగా సినీపరిశ్రమలో కథానాయకుడిగా ఉన్నా. సెకండ్ ఇన్నింగ్స్ అనేది నా డిక్షనరీలో లేదు. హిందూ సనాతన ధర్మం శక్తి పరాక్రమం ‘అఖండ2’ సినిమాలో చూస్తారు. ధర్మంగా బతకండి సత్యం మాట్లాడండి అన్యాయానికి తలవంచకండి..

ఇది అఖండ తాండవం. ప్రతిఒక్కరూ తమ పిల్లలకు ఈ సినిమాను చూపించాలి. మన హిందూ సనాతన ధర్మం ఏమిటో చెప్పాలి” అన్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. “ఇది ఒక సినిమా కాదు భారతదేశ ఆత్మ. భారతదేశం ధర్మం. ఈ సినిమా చూసిన తర్వాత అంతా అదే ఫీల్ అవుతారు. మన దేశం, మన వేదం, మన సంస్కృతి.. ఇవన్నీ ఈ సినిమాలో చూస్తారు” అని తెలిపారు.  కార్యక్రమంలో టీమ్ పాల్గొన్నారు.