calender_icon.png 19 November, 2025 | 9:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజేంద్రప్రసాద్‌కు కాంతారావు జాతీయ పురస్కారం

16-11-2025 12:00:00 AM

300పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించడం ద్వారా తెలుగువారి గుండెల్లో నట కిరీటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పదిలపరుచుకున్నారు రాజేంద్రప్రసాద్. సినీరంగానికి చేసిన సేవలకు గుర్తుగా రాజేంద్రప్రసాద్‌ను నట ప్రపూర్ణ టీఎల్ కాంతారావు స్మారక జాతీయ పురస్కారం వరించింది. నవంబర్ 16న కాంతారావు 102వ జయంతిని పురస్కరించుకొని నిర్వాహకులు ఈ అవార్డును ప్రకటించారు.

ఈ నెల 21న ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డు అదజేస్తామని ఎంపిక కమిటీ చైర్మన్ కేవీ రమణాచారి, కన్వీనర్ నాగబాల సురేశ్‌కుమార్ తెలిపారు. అవార్డు ప్రదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజుతోపాటు పలువురు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు పాల్గొంటారని పేర్కొన్నారు. 18 ఏళ్లుగా కాంతరావు జన్మదినాన్ని తాము నవంబర్ 16న నిర్వహిస్తున్నామని, ఈసారి అనివార్య కారణాల వల్ల నవంబర్ 21న నిర్వహించాల్సి వస్తోందని తెలిపారు.