09-09-2025 01:27:06 AM
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్‌స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కౌశిక్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
నా తొలి సినిమా ‘చావు కబురు చల్లగా’. ఆ తర్వాత గీతాఆర్ట్స్‌లోనే మరో సినిమా చే యాలి.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఒక సందర్భంలో నిర్మాత సాహుకు ఈ కథ చెప్పా. తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ విన్నారు. అందరికీ కథ నచ్చడంతో ప్రాజెక్టు ను మొదలుపెట్టాం. -నాకు హారర్ సినిమా చాలా ఇష్టం. ఆ జానర్‌కు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. హారర్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చేలా ఒక కథ చేయాలని ఎప్పట్నుం చో ఉండేది. ‘కిష్కింధపురి’ హారర్, మిస్టరీ.. రెండూ కలగలిసిన సినిమా. ప్రేక్షకులు అప్రయత్నంగా సీటు అంచున కూర్చొని చూసే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి.
ప్రతి సినిమాలో ఒక కొత్త విషయాన్ని చెప్పాలని ఆలోచిస్తాను. తొలి సినిమాలోనూ చాలా వైవిధ్యమైన అంశాన్ని చెప్పాను. ఈ సినిమా కూడా హారర్‌లో ఒక కొత్త అనుభూతిని అందించబోతుంది. ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయాన్ని చెప్తున్నాం.
నాకు అరుస్తూ, కేకలు వేస్తూ స్టోరీ నెరేట్ చేసే అలవాటుంది. కథ చెప్తున్నప్పుడు హీరో సాయి వాళ్లింట్లో మాటిమాటికీ కరెంట్ పోయింది. సాయి శ్రీనివాస్ వాస్తవానికి యాక్షన్ హల్క్ హీరో. అయినప్పటికీ నేను కథ చెప్పిన తీరు ఆయ నకు బాగా నచ్చటంతో ఆయన ఎప్పు డూ చేయని ఈ జానర్‌ను ఒప్పుకొన్నారు. కథ ఉన్నది ఉన్నట్లు.. చెప్పింది చెప్పినట్టు తీయమని సూచించారు. కథ, విజువల్, టెక్నికల్‌గా ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతి ఇవ్వాలంటూ సాయి మొదట్నుంచి నన్ను చాలా ప్రోత్సహించారు. మేము అనుకున్నదే స్క్రీన్ మీదకు అద్భుతంగా వచ్చింది.
కిష్కింధ అంటే మనకు రామాయణం గుర్తొస్తుంది. ఈ కథకు స్ఫూర్తి కూడా రామాయణమే. కానీ, అది చాలా మెటాఫర్‌గా ఉంటుంది. సినిమాను డీ కోడ్ చేసుకున్న వారికి రామాయణం నుంచి చాలా రిఫరెన్స్ దొరుకుతాయి.
సినిమా అంతా ఒక కల్పిత ప్రాంతం లో జరుగుతుంది. అందుకే చాలావరకు విచిత్రమైన పాత్రలను ఎంచు కున్నాం. నేను నిజ జీవితంలో చూసిన సంఘటనల స్ఫూర్తితో నాయకానాయికల పాత్రలను రూపొందిం చాను. ఇద్దరూ కొత్తగా కనిపిస్తారు. అనుపమ ఎప్పుడూ చేయని పాత్రను ఇందులో చేశారు.
ఒక రేడియో స్టేషన్‌కు వెళ్లడం వల్ల జరిగిన కథ ఇది. రేడియో స్టేషన్‌లో చాలా మ్యాసివ్‌గా ఉండాలి. ఈ కథ 1989లో మొదలవుతుంది. అలాంటి ఒక వింటేజ్ వైబ్ క్రియేట్ చేశాం. ఈ సినిమాలో కనిపించే లొకేషన్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. సినిమా అంతా పరిగెడుతూనే ఉంటుంది. కథలో చాలా యాక్షన్ ఉంది.