calender_icon.png 10 September, 2025 | 11:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విమర్శల పాలైన చిత్రానికి ప్రారంభ పూజ

09-09-2025 01:25:02 AM

‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ రూపొందిస్తున్న సినిమా ఆరంభంలోనే వివాదాస్పదమైంది. తెలుగులో బూతు ధ్వనించే పేరుతో తొలుత పోస్టర్లు విడుదల చేసిన మేకర్స్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దీంతో టైటిల్‌ను ‘బూకి’గా మార్చారు. ఈ సినిమా తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభోత్సవం జరుపుకొంది. సోమవారం నిర్వహించిన పూజా కార్యక్రమానికి హీరో సత్యదేవ్, నిర్మాత సీ కళ్యాణ్, నటి మంచు లక్ష్మి అతిథులుగా హాజరయ్యారు.

ముహూర్తపు సన్నివేశానికి అజయ్ దిషన్, ధనుష హీరోహీరోయిన్లుగా గణేశ్‌చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, శరవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్లపై రామాంజనేయులు జవ్వాజీ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో పాండియరాజన్, సునీల్, లక్ష్మి మంచు, ఇందుమతి, వివేక్ ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ ఆంటోని మ్యూజిక్ అందిస్తున్నారు. మూవీ లాంచింగ్ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. “ఈ సినిమా షూటింగును ఇప్పటికే మొదలుపెట్టాం. ఈ సినిమా మంచి కమర్షియల్ సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది. ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.