07-05-2025 12:24:36 AM
హైదరాబాద్, మే 6: ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్‌రెడ్డి సహ నలుగురు దోషులను చంచల్‌గూడ జైలుకు తరలించా రు. కోర్టులోనే వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం చంచల్‌గూడ జైలుకు తీసుకెళ్లారు. కాగా, తీర్పు నేపథ్యంలో తనకు శిక్ష తగ్గించాలని న్యాయమూర్తికి గాలి జనార్దన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తన వయసుతో పాటు సామాజిక సేవలను గుర్తించాలని కోరారు.
దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ ‘మీకు పదేళ్ల శిక్ష ఎందుకు వేయకూడదు? యావజ్జీవ శిక్షకు మీరు అర్హులు’ అని అన్నారు. గాలి జనార్దన్‌రెడ్డి ప్రస్తుతం కర్ణాటకలోని గంగావతి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా, ఓబుళాపురం మైనింగ్ కేసులో ఇప్పటికే నాలుగేళ్ల జైలుశిక్ష అనుభవించారు.