calender_icon.png 23 November, 2025 | 2:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమగ్రశిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

10-02-2025 01:22:38 AM

మంత్రివర్గ ఉపసంఘానికి సీపీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఇన్నారెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): కేజీబీవీ, సమగ్రశిక్ష ఉ ద్యోగులకు మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఎంప్లాయీస్ యూనియన్ ఎమ్మెల్సీ అభ్యర్థి తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి విజ్ఞప్తి చేశారు.

తెలం గాణ రాష్ర్ట కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో స్థితప్రజ్ఞ అధ్యక్షతన ఆదివారం జరిగిన కార్యవర్గ స మావేశంలో ఇటీవల సమగ్ర శిక్ష, కేజీబీవీలు చేపట్టిన సమ్మెకు సంబంధించి ప్రభుత్వమిచ్చిన హామీలపై చర్చించారు.

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని అప్ప ట్లో రాష్ర్ట ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్  భట్టివిక్రమార్క హామీ ఇచ్చారని తెలిపారు. యేటా ఏప్రిల్‌లో టెర్మినేషన్ విధానాన్ని ఎత్తివేయడం, మరణించిన కుటుంబాలకు, ఉద్యోగ విరమ ణ పొందినవారికి బెనిఫిట్స్ మం జూరు చేయాలని, ఆరోగ్య బీమా, కేజీబీవీ ఉద్యోగుల మాదిరి ప్రసూతి సెలవులు ఇవ్వాలనే డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకుందన్నారు. ఇచ్చి న హామీలను త్వరితగతిన పరిష్కరించాలని ఇన్నారెడ్డి డిమాండ్ చేశారు.