10-02-2025 01:22:17 AM
మంత్రి జూపల్లి కృష్ణారావు
వనపర్తి, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి) : రాష్ర్టంలో ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలు, గ్యారెంటీల అమలుతో పాటు గ్రామాల్లో మౌలిక సదు పాయాలు కల్పించేందుకు కృషి చేస్తుందని రాష్ర్ట అబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆది వారం వనపర్తి నియోజకవర్గం పెద్దమందడి మండలంలోని పలు గ్రామాల్లో స్థానిక శాసన సభ్యులు తూడి మేఘారెడ్డితో కలిసి రూ.18.71 కోట్ల నిధులతో బీటీ, సీసీ రోడ్లు, డ్రెయినేజీలు సహా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గ్రా మాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం అని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో పారిశుధ్యం, రోడ్డు రవాణా సౌకర్యాలను మెరుగుపర్చడం ద్వారా జీవన ప్రమాణాలు సుస్థిరమవుతాయన్నారు.
గ్రామాల అభివృద్ధి తోనే దేశాభివృద్ధి సాధ్యం : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వచ్చే డిసెంబర్ చివరికల్లా ఒక్క పెండింగ్ పనులు లేకుండా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. ఇళ్లులేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుం దన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, పెద్ద మందడి ఎమ్మార్వో సరస్వతి, ఎంపీడీవో సద్గుణ, సింగిల్ విండో డైరెక్టర్ సాయి చరణ్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ డీఈ లక్ష్మీ నారాయణ, ఏఈలు, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.