calender_icon.png 28 July, 2025 | 9:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగ సంరక్షణ బహుజనుల పంతం కావాలి

28-07-2025 12:00:00 AM

రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ 

కామారెడ్డి, జూలై 27 (విజయ క్రాంతి) ః భారత రాజ్యాంగ సంరక్షణ బహుజనుల పంతం కావాలని రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. రాజ్యాంగాన్ని రద్దుచేసి మను వాదాన్ని తీసుకురావాలని కలలు కంటున్నా పార్టీలను ఓడించాలని షబ్బీర్ అలీ అన్నారు.

బహుజన అలయ్ బలయ్  కార్యక్రమం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతిలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని షబ్బీర్ అలీ మాట్లాడుతూ భారత రాజ్యాంగ సంరక్షనే బహుజనుల పంతం కావాలన్నారు. అబ్ కీ బార్ చార్ సౌ పార్ అన్న బిజెపి అహంకారాన్ని రాహుల్ గాంధీ పాదయాత్ర ద్వారా అడ్డుకున్నా మన్నారు.

రాజ్యాంగాన్ని రద్దుచేసి మనువాదాన్ని తీసుకు రావాలనుకుంటున్న కలలు కలలుగానే మిగిలిపోతాయన్నారు. కంచె ఐలయ్య లాంటి మేధావులు ఈరోజు బయటకు వచ్చి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారని అన్నారు. దేశంలోనే మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మన తెలంగాణ రాష్ర్టంలో నే 42% శాతం రిజర్వేషన్ అమలు  మొదలు పెడుతున్నా మనీ తెలిపారు.

స్థానిక ఎన్నికల్లో మనమందరం ఏకమై కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి సత్తా చాటండి పిలుపునిచ్చారు. బహుజనులందరూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిం చి మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్  రాసిన రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న బహుజన అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.

ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీల హక్కుల కోసం పోరాడిన మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, పెరియర్ రామస్వామి లాంటి మహానుభావుల ఆశయాలను కొనసాగిద్దాం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించి పెట్టిన హక్కులు, రిజర్వేషన్లు నేడు ప్రమాదంలోకి నెట్టబడుతున్నాయని అన్నారు.

మన హక్కుల కోసం నిలబడి  కొట్లాడవలిసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.విద్య, రాజకీయ, సాంఘిక ఆర్థిక, అసమానతలు రూపుమాపేందుకు బీసీ, ఎస్టి, ఎస్సి, మైనార్టీలమైన మనమందరం ఒక్కటై దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి మన రాజ్యాంగాన్ని కాపాడుకుందామన్నారు.