28-07-2025 12:00:00 AM
పాల్గొన్న ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
కామారెడ్డి, జూలై 27 (విజయ క్రాంతి) ః కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్ గార్డెన్ సమీపంలో నూతనంగా నిర్మించిన వైద్యనాథ ఆలయం సమీపంలో శనీశ్వరుని విగ్రహాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు.
వేద పండితులు గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో వైదిక పండితులు పాల్గొని శనీశ్వరుని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హోమ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిల్డర్స్ రవీందర్ రెడ్డి, ఆశిరెడ్డి, బాల్ కిషన్ గుప్తా, అంబీర్ మనోహర్ రావు, తదితరులు పాల్గొన్నారు.