calender_icon.png 29 September, 2025 | 6:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్ ప్రక్రియ సక్రమంగా జరగలేదు

29-09-2025 05:45:20 PM

ఎన్నికల సంఘం పూర్తిగా విఫలం 

సిపిఐ ఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి  

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ప్రక్రియ సక్రమంగా జరగలేదని మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి  అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమురయ్య భవన్లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ‌జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రిజర్వేషన్ స్థానాల కేటాయింపుల్లో అనేక అవకతవకలు జరిగాయని తక్షణమే వాటిని సవరించాల్సిన అవసరం ఉందన్నారు. రిజర్వేషన్ స్థానాలను రిజర్వ్ చేసే ఎన్నికల సంఘం కూడా పూర్తిగా విఫలమైందని ఉన్నారు.

తక్షణమే వాటిని సవరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రివర్గం ప్రజా పాలన పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప తెలంగాణ రైతు సంఘం ఎదుర్కొంటున్న సమస్యల పైన ఏమాత్రం పట్టించుకోవడం లేదని ముఖ్యంగా రైతులకు యూరియా దొరకక అనేక ఇబ్బందులు పడుతుంటే సాగు చేస్తున్న పంటను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం యూరియా కోటాను నిర్ణయించడంలో, నిర్ణయించిన కోటకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం యూరియాను సప్లై చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందింది అన్నారు .ఖరీఫ్ సీజన్ పంటలు చేతికి వస్తున్నా రైతులకు యూరియా సరఫరా చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం వహించడాని తప్పుపట్టారు. ఖరీఫ్ సీజన్లో వరి పంటను కోయడానికి సిద్దంగా ఉంది అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు వరి పంటను కోనుగోలు చేయడానికి  ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు.కోనుగోలు చేసిన వేంటనే ప్రభుత్వం ప్రకటించిన బోనస్ తో పాటు డబ్బులు. కూడా వేంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

పత్తిపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం ఎత్తివేయడంతో పత్తి ధర తగినంతగా రాక పోవచ్ఛునని ఆందోళన వ్యక్తం చేశారు.‌కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సిసిఐ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.మొత్తం పంటలను కోనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో మాదిరిగా రైతు సంఘాలు, రాజకీయ పార్టీ ప్రతినీధులతో, అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూ మరో రింగురోడ్డు త్రిబుల్ ఆర్ నిర్మాణం చేయడానికి భూసేకరణ చేయిస్తామని ఆర్భాటం చేస్తుందని,గత ప్రభుత్వం అలైన్మెంట్ చేసిన ప్రకారం భూసేకరణ చేసి అక్కడి బహిరంగ మార్కెట్లో భూములకు వున్న ధరలకు తీసుకోవాలని అన్నారు. పూర్తిగా నిర్వాసితులు అవుతున్న వారికి ప్రభుత్వం నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి అయిలయ్య, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాల  ప్రమీల, సయ్యద్ హాశం, పాలడుగు ప్రబావతి, చిన్నపాక లక్ష్మినారాయణ, వీరెపల్లి వేంకటేశ్వర్లు పాల్గొన్నారు.