29-09-2025 05:35:35 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): పోచారం మున్సిపల్ పరిధిలోని జోడిమెట్ల వద్ద నాల ఆక్రమణలను తొలగించి సమస్యను పరిష్కరించాలని సోమవారం మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి నగరంలోని లోయర్ ట్యాంక్ బండ్ లోని హైడ్రా కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదును అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ తో పాటు నాయకులు అబ్బవతిని నర్సింహా, ఆకిటి కృష్ణారెడ్డి, గవ్వల రాములు, శ్రీనివాస్, రవికుమార్, ఆకిటి భరత్ రెడ్డి, సామల నివాస్ రెడ్డి, కూర రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.