ఇంటి నంబర్లు కేటాయించాలి.. కరెంట్ మీటర్లు బిగించాలి..
పువ్వాడ ఉదయ్ నగర్ వాసుల గోడు
రఘనాథపాలెం , డిసెంబర్ 29 (విజయక్రాంతి): తమకు ఇంటి నెంబర్లను కేటాయించాలని అదేవిధంగా కరెంట్ మీటర్లు బిగించాలని రఘునాథపలెం మండలంలోని పువ్వాడ ఉదయ్ నగర్ వాసులు తమ గోడు వినిపించారు. వీరనరీమణుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో సోమవారం జాయింట్ కలెక్టర్ శ్రీజకు వినతిపత్రం సమర్పించారు. పువ్వాడ ఉదయ నగర్ వాసులు వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్ర బాయి కు తమ గోడు వినిపించ గా, ఆమె జాయింట్‌కలెక్టర్ శ్రీజకు వినతి పత్రాన్ని సమర్పించి , అనంతరం ఉపేంద్ర బాయి మాట్లాడారు. ఓర్సు రంగమ్మ కాసా బోయిన అలివేలు మంగమ్మ బత్తుల నాగేంద్ర భూక్య శ్రీకాంత్ భూక్య నాగేంద్ర తేనె యమునా అమరారపు సరోజిని కందునూరి రేణుక మునిగాల వనజ లకు ప్లాట్ల కినెంబర్లు ఉన్నాయని , వీరంతా ఇల్లు కట్టుకుని గత పది సంవత్సరాలుగా నివసిస్తున్నారని తెలిపారు.
వీరికి ఇంటి నెంబర్లు రాకపోవడం కొందరికి కరెంట్ మీటర్లు బిగించకపోవడం ఫలితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమపథకాలు దక్కటం లేదన్నా రు. గ్రామపంచాయతీ కార్యాలయానికి ఎన్నోసార్లు వెళ్లిన , విన్నతులు చేసిన పంచాయతీ కార్యదర్శి డబ్బులు డిమాండ్ చేస్తూ వీరికి ఇంటి నెంబర్లు కేటాయించడం లేదని ఆరోపించారు. డబ్బులు ఇచ్చినవారికి కేవలం ప్లాట్లు ఉండి ఎలాంటి ఇంటి నిర్మాణం లేకపోయినా వారికి మా త్రం ఇంటి నెంబర్ కేటాయిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత సర్పంచ్ సిద్దిక్ తాలూకు బంధువు సలీమా, మరో మహిళ జలగం రాజేశ్వరి లతోపాటు ఖమ్మంలో నివసించే వందనపు రత్నకుమారికి కూడా కేవలం ప్లాట్ కు ఇంటి నెంబరు కేటాయించారని తెలిపారు.
తమకు ఓట్లు వే యలేదని కక్షతో సర్పంచ్ సిద్దిక్ ఇలా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు.అర్హులైన వారికి ఇంటి నెంబర్లు కేటాయించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సదురు వందనపు రత్నకుమారి కు , పైన పేర్కొన్న లబ్ధిదారులతోపాటు కాకపోతే ప్రభుత్వ సర్వే నెంబర్ 192 లో 75 చదరపు గజముల ప్లాటు ఉందని , ఇంటి నిర్మాణం లేదని అయినప్పటికీ అసెస్మెంట్ నెంబర్ 601 , ఇంటి నెంబరు 4_ 155 కేటాయించారని పేర్కొన్నారు. ఇదంతా సర్పంచ్ , గ్రామ కార్యదర్శి మహేష్ లుకలిసి చేస్తున్నారని ఆరోపించారు. కొంతమంది లబ్ధిదారులకు జీ వో 58 ప్రకారం క్రమబద్ధీకరించాల్సి ఉందని , వీరంతా దరఖాస్తులు సమర్పించుకున్నారని చెప్పారు.
కాగా సదరు రత్నకుమారి తన లాయర్ ద్వారా 192 సర్వేలో ఇల్లు నిర్మించుకొని, గత పది సంవత్సరాల నుండి నివసిస్తున్న వారికి ఇది తన భూమిగా ప్రకటిస్తూనోటీసులు పంపించిందని అన్నారు . గతంలోని ఇది ప్రభుత్వ భూమిగా స్పష్టం చేసిన అధికారులు ఈ అంశంపై స్పందించాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ , గ్రామ కార్యదర్శి , వందనపు రత్నకుమారి ల పై చ ట్టపరమైన, శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు య మునా ,వనజ, నీలా ,నాగేంద్ర ,రంగమ్మ, అలివేలు, సుభద్ర ,సరోజిని తదితరులు పాల్గొన్నారు






