15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

సన్నబియ్యం పథకం గొప్పది

09-04-2025 02:05 AM

మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి

నల్లగొండ, ఏప్రిల్ 8 (విజయక్రాంతి) : సన్నబియ్యం పథకం చాలా గొప్పదని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని ఓ దళిత కుటుంబం ఇంట్లో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల విరేశం, డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డితో కలిసి ఆయన సన్నబియ్యం భోజనం చేశారు.

ఈ సందర్భంగా మండలి ఛైర్మన్ మాట్లాడుతూ.. గతంలో దొడ్డు బియ్యం తినలేక లబ్ధిదారులు దళారులకు అమ్మి సన్నబియ్యం కొనుక్కునే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. దళారులకు మేలు చేసే ఈ విధానానికి స్వస్తి పలికి ప్రజాప్రభుత్వం పేదలు కడుపునిండా తినేలా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం  పేదల పక్షపాతిగా పని చేస్తుందని పేర్కొన్నారు.

సన్నబియ్యం పథకాన్ని పక్కా ప్రణాళికతో అమలు చేస్తున్న పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులను మండలి ఛైర్మన్ అభినందించారు.  ఆయన వెంట మదర్ డెయిరీ మాజీ ఛైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి, ఆర్యవైశ్య సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు వనమ వెంకటేశ్వర్లు తదితరులున్నారు.