పోలీస్ యాక్ట్ -30ని వెనక్కి తీసుకోవాలి
భీమదేవరపల్లి, ఏప్రిల్ 8 (విజయ క్రాంతి): పోలీస్ యాక్ట్ -30ని రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే వెనక్కి తీసుకోవాలని బి ఆర్ ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు మండల సురేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్‌ఎస్ పార్టీ మీద, బిఆర్‌ఎస్ కార్యకర్తల మీద కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాడని అన్నారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని ఆరు గ్యారెంటీలు అమలు చేయ చేతగాక అడిగే వాళ్ళ మీద అక్కస్సు వెళ్లగక్కుతున్నాడు. ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు ప్రయ త్నాలు చేస్తున్నాడని ఆరోపించారు ప్రతిపక్ష నాయకులపై బిఆర్‌ఎస్ కార్యకర్తలపై కేసులు పెడుతూ పోలీసు వ్యవస్థను తన సొంత ఏజెండాకు వాడుకుంటున్నాడని అన్నారు .
భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించి 25 సంవ త్సరాలు అయిన సందర్భంగా హనుమ కొండ జిల్లాలోని ఎల్కతుర్తి మండలం లో నిర్వహించబోతున్న రజితోత్సవ మహా సభను అడ్డుకోవడానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిలో భాగంగానే వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ చేత వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ప్రాంతాల్లో ఏప్రిల్ 6 నుండి మే 5 వరకు నెలరోజులపాటు ఎలాంటి సభలు సమావేశాలు జరపకుండా మైకులు పెట్టకుండా సిటీ పోలీస్ యాక్ట్ - 30అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయించాడని అన్నారు.బిఆర్‌ఎస్ కార్యకర్తలు ఉద్యమ కారులు ఏనాడు కేసులకు, పోలీస్ యాక్టు లకు భయపడరని సభపై ముఖ్యమంత్రి చేసే కుటిల ఎత్తులను తిప్పి కొడతామన్నారు.
మా నాయకుడు ఒడితల సతీష్ కుమార్ నాయకత్వంలో లక్షలాదిమంది కెసిఆర్ అభిమానులను సభకు తరలించి కెసిఆర్ పై అభిమానాన్ని చాటుకుంటాం అన్నారు. పార్టీల టకతీతంగా కేసీఆర్ అభిమానులు ఈ సభకు స్వచ్ఛందంగాప్రజల ఆకాంక్షలను గౌరవించకుండా, ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కే చిల్లర పనులు మాను కోవాలని హెచ్చరిస్తూ, సిటీ పోలీస్ యాక్ట్ - 30 నీ వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






