23 June, 2026 | 7:49 PM

Breaking News

పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •  

ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత

24-01-2026 12:00 AM

అంతర్గాం జనవరి 23 (విజయక్రాంతి) ఓటు హక్కు ప్రతి పౌరుడు బాధ్యత అని అంతర్గం తాహాశీ ల్దార్ తుము రవీందర్ పటేల్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో విద్యార్థుల చేత జాతీయ ఓటర్ దినోత్సవం ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ మండల కేంద్రంలో ప్రధాన చౌరస్తా వద్ద ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అంతర్గాం తహశీల్దార్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం వారి హక్కు అని కావున ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు.

ఓటు హక్కు మన ఆయుధం, ఓటు హక్కు వినియోగించుకోవడం మన హక్కు అనే నినాదంతో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు తూము రవీందర్ పటేల్, డిప్యూటీ తహశీ ల్దార్ మల్యాల తిరుపతి, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఎ. సుమలత, గిరిధవార్లు సడెంక శ్రీమాన్, సెర్వేర్ లలిత, ఎంపిఎస్‌ఒ మల్లెపెల్లి శైలజ, ఆపరేటర్ పులి సతీష్, జి.వేణు, జి పి ఒ, జి పి ఒ జిల్లా అధ్యక్షులు మర్రి శంకర్ స్వామి, వివిధ గ్రామాల జి పి ఒ లు న్యాతారి వినోద, బి. పుష్పలత, పి. రాజకుమార్, ఎన్. శ్రీనివాస్, కె. పోచం, జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ శోభ, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.