24-01-2026 12:00:00 AM
ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి
నవాబ్ పేట్,జనవరి 23: మండలంలోని కారుకొండ గ్రామంలో సమగ్ర శిక్ష నిధులతో రూ.11 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సమగ్ర భవిత ఆక్టివిటీ సెంటర్ భవనం, గ్రామపంచాయతీ భవనాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్య, అభ్యాసం, నైపుణ్యాల అభివృద్ధికి సమగ్ర భవిత ఆక్టివిటీ సెంటర్లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. విద్యార్థులు మరియు యువత ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలని సూచించారు.
అలాగే గ్రామపంచాయతీ భవనం ద్వారా గ్రామ పరిపాలన మరింత సులభతరం అవుతుందని పేర్కొన్నారు.అనంతరం గ్రామంలోని లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను ఎమ్మెల్యే గారు పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల లబ్ధి అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమం లో పలువురు నాయకులు ఉన్నారు.