calender_icon.png 12 November, 2025 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘వికసిత్ భారత్’లో బ్యాంకుల పాత్ర కీలకం

12-11-2025 12:00:00 AM

డీఎఫ్‌ఎస్ కార్యదర్శి నాగరాజు 

హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాం తి): యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 107వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఖమ్మంలోని గొరిల్లా పార్క్ ఫంక్షన్ హాల్‌లో మంగళ వారం కస్టమర్లు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించారు.  భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవ ల విభాగం (డీఎఫ్‌ఎస్) కార్యదర్శి ఎం నాగరాజు ముంబైలోని బ్యాంక్ కేంద్ర కార్యాల యంలో జరిగిన ప్రధాన కార్యక్రమానికి ప్రధాన అతిథిగా హాజరయ్యారు.

ఆయన తన ప్రసంగంలో భారత ప్రభుత్వం నిర్దేశించిన ‘వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధిం చడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండి, సీఈవో అశీష్ పాండే, భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దేశ సేవలో మళ్లీ అంకితభావంతో ముందుకు సాగాలని బ్యాంక్ సిబ్బందిని పిలుపునిచ్చారు. ఖమ్మం ప్రాంతీయ అధికారి ఆరెడ్డి హనుమంతరెడ్డి తన ప్రసంగంలో యూనియన్ బ్యాంక్ సిబ్బంది, కస్టమర్లకు మరింత సమర్థవంతమైన సేవలను అందించి బ్యాంక్, కస్టమర్ల అభివృద్ధిని సాధించాలని పిలుపునిచ్చారు. తక్కువ వడ్డీ రేట్లతో అందుబాటులో ఉన్న బ్యాంక్ ఉత్పత్తులు, సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ హెడ్స్ సర్వేష్ టి, ఎన్ సుధాకర్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.