11-07-2025 12:00:00 AM
కామారెడ్డి, జూలై 10 (విజయ క్రాంతి): ఓటర్ జాబితా తయారీలో బూత్ లెవెల్ అధికారుల పాత్ర కీలకమని అడిషనల్ రెవెన్యూ కలెక్టర్ విక్టర్ అన్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో దోమకొండ, బీబీపేట్ రెండు మండలాల బి ఎల్ ఓ లకు ఓటరు జాబితాపై అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని విక్టర్ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ సందర్శించి ఫారం 6 చేర్పులు,
ఫారం7 తొలగింపులు, ఫారం 8 మార్పులు పై అవగాహన కల్పించి, ఎప్పటికప్పుడు బి ఎల్ ఓ లు రిజిస్టర్ ను అప్డేట్ చేయాలని సూచించారు. ట్రైనింగ్ ప్రోగ్రాంకు రాజంపేట నయబ్ తహసీల్దార్ సంతోష ట్రైనర్ గా వ్యవహరించారు. కార్యక్రమంలో దోమకొండ తహసీల్దార్ జి. సుధాకర్, నాయబ్ తహసీల్దార్ ఎన్. రేఖ, దోమకొండ, బీబీపేట మండల బిఎల్‌ఓ లు పాల్గొన్నారు.