calender_icon.png 11 July, 2025 | 8:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తమ్మరలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు..

10-07-2025 10:59:58 PM

కోదాడ: పట్టణ పరిధిలోని తమ్మర గ్రామ పరిధిలోనీ సాయి మందిరంలో గురు పౌర్ణమి(Guru Purnima) వేడుకలు గురువారం శ్రీ సత్య సాయి సేవ సమితి నిర్వాహకులు గురువారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే స్వామివారికి పంచామృత అభిషేకాలు, అర్చనలు, హారతి నివేదన, తీరొక్క పూలతో అలంకరణ, హారతి నివేదన, పల్లకి సేవ, వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కనుల పండువగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ వారు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, చుట్టుపక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.