calender_icon.png 11 July, 2025 | 8:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిఎల్ఓ శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్ రాంబాబు

10-07-2025 10:58:00 PM

నూతనకల్ (విజయక్రాంతి): మండల కేంద్రములోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన జాతీయ స్థాయి బూత్ లెవల్ ఆఫీసర్ల(BLO) శిక్షణ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ రాంబాబు(Additional Collector Rambabu) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల నమోదులో బిఎల్ఓల పాత్ర అత్యంత కీలకం అని సమర్థవంతమైన ఓటర్ల జాబితా నిర్వహణకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాసరావు ,శిక్షణా నిపుణులు మరియు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.