15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

22-06-2025 09:32 AM

తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanam) ఆదివారం భక్తుల రద్దీ  కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు వెంకన్న కొండకు చేరుకున్నారు. తిరుమలతో శ్రీవారి సర్వదర్శనం (Srivari Sarva Darshan) కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైనులో వేచి ఉన్నారు. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని ఆయల అధికారులు ప్రకటించారు. శనివారం శ్రీవారిని రికార్డు స్థాయిలో (90,087) మంది భక్తులు దర్శించుకున్నారు. 41,891 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.3 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.