11 August, 2026 | 1:45 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

‘ఆర్థికం’ను చక్కదిద్దేందుకు నిపుణుల కమిటీ!

22-06-2025 12:39 AM
  1. సంక్షేమ పథకాల అమలుపై నిర్మాణాత్మక నిర్ణయం
  2. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదించే అవకాశం

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాం తి): మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం, ప్రస్తుతం దాదాపు రూ. 8లక్షలకోట్ల అప్పుల భారాన్ని మోస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంద ని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. అందుకే ఆర్థిక నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కమిటీ ఏర్పాటుపై ఇప్పటికే కసరత్తు ప్రారంభమైనట్టు తెలుస్తోంది.

కేబినెట్ ర్యాంకుతో కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, ఆర్థికంగా నిలదొక్కుకునేందు కు ఉన్న అవకాశాలు, అందుబాటు లో ఉన్న వనరులపై అధ్యయనం చే యించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆర్థిక నిపుణుల కమిటీ ఏర్పాటుకు సంబంధించి పలువురు పార్టీ సీనియర్ నాయకులు, మేధావుల నుంచి సీఎం రేవంత్‌రెడ్డికి సిఫార్సులు అందినట్టు సమాచారం.

సీఎం రేవంత్‌రెడ్డి కూడా కమిటీ ఏ ర్పాటుపై సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం వద్ద ఉన్న సిఫార్సులపే పరిశీలించి ఆమోదించిన వెంటనే ఆర్థిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయను న్నారు. సంక్షేమ పథకాలకు కేటాయించే బడ్జెట్‌ను ని పుణుల కమిటీ సూచనల మేరకు స మర్థవంతంగా ప్రజలకు చేర్చడంలో నిర్మాణాత్మకంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది.