calender_icon.png 27 November, 2025 | 1:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకాశ హర్మ్యాల్లోనే ఆహుతి !

27-11-2025 12:59:11 AM

  1. 36 మంది సజీవ దహనం

హాంకాంగ్‌లో భారీ అగ్ని ప్రమాదం

అపార్ట్‌మెంట్ల మధ్య చెలరేగిన మంటలు..  

ఆచూకీ లభించని మరో 279 మంది.. మంటల్లో చిక్కుకున్న వందలాది మంది

మృతుల సంఖ్య పెరగొచ్చని అంచనా

హాంకాంగ్, నవంబర్ 26 : హాంకాంగ్‌లోని ఆకాశ హర్మ్యాల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించి ౩౬ మంది సజీవ దహనమయ్యారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడగా వందలాది మంది మంటల్లో చిక్కుకుపోయినట్లు సమాచారం. మరో 279 మంది ఆచూకీ లభించలేదు. తాయ్ పో జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న బహుళ అంతస్థుల( ఎనిమిది బ్లాకు లు) భవన సముదాయంలో  కొన్ని నిర్మాణ దశలో ఉన్నట్లు తెలిసింది. మొత్తంగా ఈ అపార్ట్‌మెంట్లలో సుమారు 4,600మంది నివాసం ఉంటున్నారు. 

అపార్ట్‌మెంట్ల మధ్య మంటలు చెలరేగి..

తాయ్ పో జిల్లాలోని హౌసింగ్ ఎస్టేట్ అ యిన వాంగ్ ఫక్ కోర్టులో ఎనిమిది బ్లాకులు ఉన్నాయని తాయ్ పో జిల్లా కౌన్సిలర్ మము య్ సియుఫంగ్ మీడియాకు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 2.51గంటల సమయం లో అపార్ట్‌మెంట్ల మధ్య మంటలు చెలరేగి అవి సుమారు రెండు వేల ఫ్లాట్ల (ఏడు బ్లాకు లు) వరకు వ్యాపించాయి.  దీంతో మంటల్లో చిక్కుకున్న వారు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారని తెలుస్తోంది.

విషయం తెలుసుకుని సుమారు 700మంది అగ్నిమాపక సిబ్బంది భవనాల్లోకి ప్రవేశించి రక్షణ చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో గాయపడిన వారిని గుర్తించి ఆస్పత్రులకు తరలించినట్లు తెలుస్తోంది. వీరిలో కూడా కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచా రం.

వేలాది మంది నివాసిస్తున్న ఈ అపార్ట్‌మెంట్లలో ఇంకా ఎంత మంది మంటల్లో చిక్కుకున్నారో తెలియని పరిస్థితి. మంటలు భారీగా ఎగిసిపడుతుండడంతో పాటు దట్టమైన పొగ సహాయక చర్యలకు అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. అయితే, ప్రమాదానికి స్పష్టమైన కారణం తెలియకున్నా మృతుల సంఖ్యపెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.