10 April, 2026 | 7:28 AM

రాజన్న కోడెల విక్రయం అబద్ధం

08-12-2024 01:28 AM

మా ప్రభుత్వంపై బురదజల్లే కుట్ర..

దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్/సిరిసిల్ల, డిసెంబర్ 7 (విజయక్రాంతి): వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని కోడెలను అక్రమం గా విక్రయించినట్లు వచ్చిన వార్తల్లో నిజంలేదని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శనివారం ప్రకటనలో తేల్చి చెప్పారు. ప్రభుత్వంపై బురదజల్లేందుకే కొందరు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భక్తులు ఆలయానికి సమర్పించినన కోడెల నిర్వహణ నిమిత్తం ఆరు నెలల క్రితం సిరిసిల్ల కలెక్టర్ చైర్మన్‌గా, వేములవాడ ఆలయ ఈవో కన్వీనర్‌గా, పలువురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి మార్గదర్శకాలను రూపొందించినట్లు లేఖలో పేర్కొన్నారు.

ఈ మేరకు జీవోను విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మార్గదర్శకాల ప్రకారం పట్టదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్, మం డల అగ్రికల్చర్ ఆఫీసర్ ధ్రువీకరణ పత్రం ఆధారంగానే కోడెలను పంపిణీ చేసినట్లు తెలిపారు. కోడెలను అక్రమంగా విక్రయించారని వచ్చిన ఆరోపణల్లో నిజం లేదన్నా రు. హిందువుల మనోభావాలు, రాజన్న భక్తుల నమ్మకాలను దెబ్బతీసే విధంగా అస త్య ప్రచారం చేసేవారిపై చట్టపరంగా చర్యలు చేపడతామని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు.

కాగా కోడెలను అక్రమంగా విక్ర యించినట్లు వస్తున్న వార్త కథనాల్లో నిజం లేదని రాజన్న ఆలయ ఈవో వినోద్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆలయ సమావేశ మంది రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి కోడెకు ట్యాగ్ ఉంటుందని, దొరికిన వాటిలో ఒక్కటి కూడా ట్యాగ్ ఉన్న కోడె లభించలేదన్నారు.