నూతన కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి
* ఓయూ రిజిస్ట్రార్ ప్రొ. నరేశ్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 7 (విజయక్రాంతి): దేశంలో అమలవుతున్న నూతన జాతీయ విద్యా విధానంలో భాగం గా విద్యార్థులకు ఉపయోగపడేలా పలు కాంబినేషన్లతో ఉన్న విభిన్నమైన కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ.నరేశ్ రెడ్డి సూచించారు. ఐఐఎంసీ కళాశాల, ఆంబిషన్స్ కెరీర్ కౌన్సిలర్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ‘బిజినెస్ స్కూల్స్ ఫెయిర్ అండ్ ఎంబీఏ ఎక్స్‌పో లక్డీకపూల్‌లోని వాసవీ కల్యాణ మండపంలో శనివారం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఓయూ రిజిస్ట్రార్ ప్రొ.నరేశ్ రెడ్డి మాట్లాడుతూ.. డిగ్రీ అనంతరం చేయాల్సిన కోర్సులపై విద్యార్థులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవస రం ఉందన్నారు. అలాంటి వారికి ఈ ఎక్స్‌పోలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఐఐఎంసీ కళాశాల ప్రిన్సిపాల్ రఘువీర్ మాట్లాడుతూ.. ఈ ఎక్స్‌పోలో దేశ విదేశాలల్లోని ప్రముఖ ప్రాంతాల నుంచి 35 బిజినెస్ స్కూల్స్ పాల్గొన్నట్టు తెలిపారు. మొత్తం 20 కళాశాలల నుంచి 200 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు.
ఈ కార్యక్రమం ఆదివారం కూడా కొనసాగుతుం దన్నారు. ఐఐఎంసీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ తిరుమలరావు, సంతోషి, ఆంబిషన్స్ కెరీర్ కౌన్సిలర్ సంస్థ సభ్యులు సాయిరాం, కౌటిల్య శ్రీధర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.




