13-01-2026 12:00:00 AM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల, జనవరి 12(విజయ క్రాంతి): పారిశుధ్య కార్మికుల శ్రమ, వారు అందించే సేవలు అమూల్యమైనవని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం నకిరేకల్ పట్టణంలోని మెయిన్ సెంటర్ నందు రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచిన సందర్భంగా కార్మికులతో కలిసి ఆయన అల్పాహారం స్వీకరించారు. కార్యక్రమంలో స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత - శ్రీనివాస్, మున్సిపాలిటీ కమిషనర్, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.