calender_icon.png 2 July, 2025 | 4:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నతల్లిని కడతేర్చిన కొడుకు

02-07-2025 12:00:00 AM

చికిత్స పొందుతూ తల్లి మృతి 

వరంగల్ (మహబూబాబా ద్), జూలై 1 (విజయక్రాంతి): డబ్బు కోసం కన్నతల్లిపై కొడుకు పెట్రోల్  పోసి నిప్పంటించిన ఘటనలో బాధితురాలు చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. ఈ ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లిలో జరిగింది. నిందితుడు సతీశ్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపా రు. సీఐ రాజగోపాల్ తెలిపిన ప్రకారం నిందితుడు సతీశ్ తల్లిదండ్రులకు కుంటపల్లి గ్రామంలో 5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.

ఇందులో నాలుగు ఎకరాల భూమిని కాకతీయ టెక్స్ టైల్ పార్కుకు ఇవ్వగా రూ. 40 లక్షల పరిహారం వచ్చింది. ఇందులో రూ.30 లక్షలతో సతీశ్ 2.5 ఎకరాల భూమి ని కొనుగోలు చేశాడు. తల్లి వినోద తన వద్ద ఉన్న మిగిలిన రూ. 10 లక్షలను తన సోదరికి ఇస్తుందని భావించి తల్లితో సతీశ్ నిత్యం గొడవ పడేవాడు.

తనకు ఆస్తి దక్కకుండా చేస్తుందని కక్ష పెంచుకున్న సతీ శ్.. తల్లిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 27న రాత్రి  బాటిల్‌లో పెట్రోల్ తెచ్చుకుని రాత్రి ఒంటిగంట సమయంలో ఇంటి గోడ దూకి మరోసారి డబ్బుల విషయంలో తల్లితో గొడవపడ్డాడు. నువ్వు చస్తేనే నాకు డబ్బులు వస్తాయని గొడవకు దిగాడు. 

ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను తల్లిపై పోసి నిప్పంటించాడు. తల్లి కేకలు వేయడంతో ఆమె భర్త లేచి చూసేసరికి నిందితుడు పారిపోయాడు. చుట్టుపక్కల వారు వచ్చి మంటలు ఆర్పారు. 85 శాతం కాలిపోయి ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్సకోసం వరంగల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొం దుతూ మంగళవారం తెల్లవారుజామున తల్లి మరణించినట్లు సీఐ చెప్పారు.