25 March, 2026 | 2:08 AM

డీలిమిటేషన్‌లో దక్షిణాదికి అన్యాయం జరగదు

25-03-2026 12:17 AM
  1. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు

హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): డీలిమిటేషన్‌లో దక్షిణాదికి ఎక్కడా అన్యాయం జరగదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు పేర్కొన్నారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ దక్షిణ రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని, ఉత్తర రాష్ట్రాలకు లాభం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ, ఇండీ అలయెన్స్ పార్టీలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్ధమన్నారు. రాబోయే 2026 జనగణన అనంతరం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి, ప్రస్తుతం ఉన్న సీట్ల ప్రాతిపదికన ప్రపోర్షనేట్‌గా పునర్విభజన జరుగుతుందని కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దన్నారు.

డీలిమిటేషన్ అనేది ప్రతి జనగణన తర్వాత జరిగే రాజ్యాంగబద్ధ ప్రక్రియ అని, జనగణన పూర్తున తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి, కొత్తగా నియోజకవర్గాల పునర్విభజన చేస్తారన్నారు. డీలిమిటేషన్ పూర్తిగా జనాభా ఆధారంగా మాత్రమే జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం తప్పు దారి పట్టించేదిగా ఉందన్నారు.

ఒకవేళ కేవలం జనాభా ఆధారంగా చేస్తే దక్షిణ రాష్ట్రాల్లో చాలా తక్కువ సీట్లు రావాల్సి ఉం టుందని, అక్కడ ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉన్న ప్పటికీ సీట్ల సంఖ్య మాత్రం ఎక్కువగా ఉందన్నారు. హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కూడా జనాభా తక్కువగా ఉన్నప్పటికీ అసెంబ్లీ సీట్లు అధికంగా ఉన్నాయని, కాబట్టి కేవలం జనాభా ఆధారంగా డీలిమిటేషన్ జరుగుతుందనడం పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లను ఆధారంగా తీసుకుని సీట్ల పెంపు జరుగుతుందని అన్నారు.