7 May, 2026 | 12:53 AM

క్రీడా మైదానం.. అలంకార ప్రాయం!

07-05-2026 12:00 AM
  1. నిర్వహణ శూన్యం
  2. మైదానాల్లో పెరిగిన పిచ్చి మొక్కలు
  3. గత పాలకుల చేతిలో క్రీడాకిట్లు
  4. పట్టించుకోని అధికారులు

చేగుంట, మే 6 : గ్రామీణప్రాంత విద్యార్థులు, యువత క్రీడల్లో రాణించాలనే లక్ష్యంతో  గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. ఇందుకోసం రూ.లక్ష్యల్లో వ్యయం ఖర్చు చేసింది. వాటిని ఏర్పాటు చేసినప్పటి నుంచి పాలకులు, అధికారులు నిర్వహణ పట్టించుకోకపోవడం, అట్టి మైదానాలు ఆటలకు అనువుగా లేకపోవడంతో ప్రభుత్వ నిర్దేశించిన లక్ష్యం నెరవేరడంలేదు.

మండలం లో ఉన్న పంచాయతీల్లో ఉన్న క్రీడాప్రాంగణాల సౌకర్యాల కల్పనలో అప్పటి అధికారులు విఫలమయ్యారు. మండలాల్లో 27 గ్రామం పంచాయతీ లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసారు, వీటిలో ఎక్కువ క్రీడా ప్రాంగణాలకు ప్రభుత్వస్థలంలో ఉన్నాయి. మండలం వ్యాప్తంగా మొత్తం 27 క్రీడాప్రాంగణాలను పూర్తిచేసినట్లు అధికారుల లెక్కలు తెలుపుతునప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడా అన్ని విధాల సౌకర్యాలు కృలించిన దాఖలాలు లేవు.

గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ప్రాంగణలో భమి చదును చేసేందుకు, మొక్కలు నాటేందుకు సౌకర్యాల కల్పనకు రూ.2లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అనేక ప్రాంగణాల్లో గత సర్పంచ్ లు, పంచాయతీ సెక్రటరీ లు నామ్ కే వాస్తేగా పనులు చేసి చేతులు దులుపినట్లు ఆరోపణలు ఉన్నాయి.

క్రీడా ప్రాంగణాలపై  అధికారులు బోర్డులు ఏర్పాటు చేసి రికార్డుల్లో మాత్రం పనులు పూర్తి అయినట్లు చూపి స్తున్నారు. దీంతో చాలా మైదానాలు చదును చేయకపోగా పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి. కొన్ని ప్రాంగణాలు గ్రామాలకు దూరంగా ఉండి కనీసం సరైన రహదారి సైతం లేకుండా ఉన్నాయి.

నిరుపయోగంగా కిట్లు..

క్రీడాప్రాంగణాల కోసం గత ప్రభుత్వం పతి క్రీడా మైదానానికి క్రీడాకిట్లనుకుడా మంజూరు చేసింది. ఒక్కో కిట్లో క్రికెట్, వాలీబాల్ కిట్, టీషర్టులు, మూడు జతల డంబెల్  తో పాటు మొత్తం 23రకాల అట పరికరాలు ఇచ్చారు,గ్రామ పంచా యతీల వారీగా అధికారులు కిట్లను పంపిణీచేశారు.

ప్రస్తుతం క్రీడా మైదా నాలు, అటలకు అనువుగా లేకపోవడంతో వాటిని అప్పటి పాలక వర్గం వారు క్రీడా కిట్లు క్రీడాకారులకు  ఇవ్వకుండా తమ ఇంట్లోనే ఉంచుకున్నట్లు కీటకారులు వాపోయారు, ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామీణ క్రీడా మైదానాలను అభివృద్ధిపరిచి యువకుల్లో క్రీడా నైపుణ్యాన్ని బలపరచాలని కీటకారులు కోరుతున్నారు.