25-07-2025 01:21:49 AM
10 పతకాలు గెలిచిన విజేతలకు డీజీపీ అభినందనలు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 24,(విజయక్రాంతి): అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ప్రపంచ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ లో తెలంగాణ పోలీస్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఈ క్రీడల్లో తెలంగాణ పోలీసులు ఏకంగా 10 పతకాలు గెలుచుకొని రాష్ట్రానికి కీర్తిని తీసుకొచ్చారు. పతకాలు సాధించిన విజేతలను తెలంగాణ డీజీపీ గౌరవించి, ఘనంగా అభినందించారు.
కార్యక్రమంలో ఐజీపీ స్పోర్ట్స్ ఎం రమేశ్ ఐపీఎస్, డీఎస్పీ డాక్టర్ ఆర్‌వీ రామారావు కూడా పాల్గొన్నారు. బృందం సాధించిన ఈ విజయం ఇతర పోలీసు సిబ్బందికి స్ఫూర్తినిస్తుందని డీజీపీ పేర్కొన్నారు. క్రీడల్లో పోలీసుల భాగస్వామ్యం వారి శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంచుతుందని, తద్వారా సమర్థవంతమైన పోలీసింగ్‌కు దోహదపడుతుందని ఈ సందర్భంగా డీజీపీ గుర్తు చేశారు.