calender_icon.png 8 January, 2026 | 7:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘట్ కేసర్‌లో స్వామి వివేకానంద జయంతి వారోత్సవాలు ప్రారంభo

06-01-2026 12:29:03 AM

ఘట్ కేసర్, జనవరి 5 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ పట్టణంలోని గురుకుల్ జూనియర్ కళాశాల మైదానంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవ వారోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభించారు. స్వామి వివేకానంద ఆదర్శాలను పిల్లలలో, యువకులలో నింపడానికి క్రీడా పోటీలు, వ్యాసరచన పోటీలు సహా వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ కన్వీనర్  విప్పర్ల హనుమాన్ తెలిపారు.

ఈవారోత్సవాలలో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, క్యారమ్స్, బాడ్మింటన్ క్రీడలు నిర్వహిస్తున్నట్లు కో-కన్వీనర్లు బచ్చు నాగేష్ కుమార్ గుప్తా, సోమసాని రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా సింగిరెడ్డి రాంరెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి, ముల్లి పావని జంగయ్య యాదవ్, బండారి శ్రీనివాస్ గౌడ్, కొమ్మిడి మైపాల్ రెడ్డి , మారం లక్ష్మారెడ్డి, సార శ్రీనివాస్ గౌడ్, రేసు లక్ష్మారెడ్డి, కడపోల్ల మల్లేష్, ఎండీ సీరాజ్, మేకల దాస్, తోట వీరేష్ కుమార్, బర్ల దేవేందర్, విక్రాంత్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, శ్రీధర్, సంజీవ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వాహకులుగా అంకం చందు యాదవ్, కొమ్మిరిశెట్టి ఉదయ్ , పల్లె శివ మరియు పోట్లచెరువు సుమిత్ ఉన్నారు.