calender_icon.png 11 July, 2025 | 2:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లందులో రాజ్యమేలుతున్న సిండికేట్ వ్యవస్థ

11-07-2025 12:00:00 AM

ఇల్లందు. జులై 10 (విజయక్రాంతి) తెల్లందు ఆప్కారి సర్కిల్ పరిధిలో మద్యం మాఫియా విచలి విడిగా నడుస్తోందని,తక్షణమే మద్యం మాఫియాను అరికట్టాలని ఇల్లందు మండల బిజెపి పార్టీ అధ్యక్షులు భట్టు రమేష్ డిమాండ్ చేశారు. గురువారం బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎక్సై జ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంప్రసాద్ కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ సిండికేట్ వ్యవస్థ సాగుతుందన్నారు.

బెల్ట్ షాపులు ,వైన్ షాప్ లో ఖరీదైన మద్యంబ్రాండ్ల పై కొరత విధిస్తూ, బెల్టుషాపుల్లో వాటిని అధిక ధరలకు వ్యక్రయిస్తున్నారని ఆరోపించారు.ఇల్లందు , పరిసర ప్రాంతాల్లో బెల్ట్ షాపులు ఎక్కువ ఉండటమే కాకుండా ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు (క్వాటర్ బాటిల్ పై 50రూ ) విక్రయిస్తూ సామాన్య ప్రజలు జేబులను కొల్లగొడుతున్నారనీ ఆరోపించారు.

అందుకు కారణం పట్టణంలోని ఉన్న వైన్ షాపులు సిండికేట్ గా ఏర్పాటు చేసుకొని బెల్ట్ షాపులకు అధిక ధరలకు సరఫరా చేయడమే అన్నారు. వైన్ షాపులల్లో సరైన మద్యం ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనీ, కొత్త కొత్త బ్రాండ్ల వల్ల ప్రజల ఆరోగ్యనికి హానికలిగే ప్రమాదం ఉందన్నారు.. సిండికేట్ వ్యవస్థ వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని సైతం గండికోడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మండల నాయకులు రాజేష్, శ్రీకాంత్, రాంచందర్ నాయక్, వీరన్న, తదితరులు పాల్గొనడం జరిగింది.