calender_icon.png 11 July, 2025 | 4:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు

11-07-2025 12:00:00 AM

 జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ

మహబూబాబాద్, జూలై 10 (విజయక్రాంతి): పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్ రఫీ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలో రెవెన్యూ , పోలీసు, ఎక్సైజ్ అధికారులతో   పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలనే ప్రధాన ఏజెండాగా సమన్వయ సమావేశం  నిర్వహించారు. 

ఈ సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ మాట్లాడుతూ క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరించాలంటే జైల్లో ఉన్న ఖైదీలను కోర్టులో సకాలంలో హాజరు పరచాలని,  పెండింగ్ వారెంట్లు త్వరగా క్లియర్ చేయాలని, సాక్షులను సరైన సమయంలో హాజరు పరచాలని,  విచారణ అధికారులు తమ తమ విచారణలను త్వరగా ముగించి కోర్టుకు సహకరించాలన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, సీనియర్ సివిల్ జడ్జి శాలిని, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ స్వాతి మురారి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి అరవపల్లి కృష్ణ తేజ్, తొర్రూర్ జూనియర్ సివిల్ జడ్జి దీరజ్ కుమార్, డి.ఎస్.పి తిరుపతిరావు, జిల్లా కోర్టు పరిపాలనాధికారి క్రాంతి కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్ల్, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.