calender_icon.png 17 November, 2025 | 9:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్నూర్ గురుకుల విద్యార్థుల ప్రతిభ

17-11-2025 12:00:00 AM

బిచ్కుంద, నవంబర్ 16 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్  మండల తెలంగాణ గురుకుల బాలుర విద్యాలయం మరియు జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు అండర్ 17 ఖో ఖో, అండర్ 14 ఖో ఖో పోటీల్లో జిల్లా స్థాయి క్రీడా ప్రతిభను చూపారని ప్రిన్సిపాల్ సుధాకర్, వ్యాయామ ఉపాధ్యాయులు జాదవ్ గణేశ్ ఆదివారం తెలిపారు.

కామారెడ్డి ప్రధాన నగరములో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన అండర్ 17 ఖోఖోలో గోతి జగదీశ్,జవహర్ సింగ్, సి.హెచ్ జ్ఞానేశ్వర్, కే.బాలాజీ, బి రామకృష్ణ, అండర్ 14 ఖోఖోలో డోవెగ్ర రమేశ్, యం.సాయితేజ, సి హెచ్ అర్జున్, కే.నవదీప్‌లు జిల్లా స్థాయి పోటీల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులను జిల్లా విద్యాశాఖాధికారి  రాజు, యస్‌జీఎఫ్ అధికారి హీరాలాల్  చేతుల మీదుగా అందుకున్నట్లు చెప్పారు.

ఈ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు. ప్రముఖ పద్యకవి వ్యాఖ్యాత డా బి.వెంకట్, సుధాకర్, గణేశ్, పీ బీ నాగరాజు, రక్షకుడు ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు సుమన్, వేణుగోపాల్, సంతోష్, నరహరి ప్రసాద్, రాము, సంజు, దత్తు, గంగా ప్రసాద్ విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.