calender_icon.png 27 July, 2025 | 2:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆచార్యుడు నిత్య విద్యార్థి

19-07-2025 12:00:00 AM

ఆచార్య మసన చెన్నప్ప :

యోగ దర్శనానికి తెలుగులో విపులమైన వ్యాఖ్య చేయాలన్న నా తలంపు నెరవేరడానికి ప్రోత్సహించిన చెక్కల వెంకటేశ్వర్లును, గ్రంథ సహాయం చేసిన ధర్మవీర్‌ను నేనెప్పుడూ మరువలేదు. కవులను తయా రు చేసే వారిని మహాకవులంటారు. ఋషులను తయారు చేసే వారిని మహా గురువులంటారు. అలాగే యోగులను తయారు చేసే వారు మహాయోగులు. ధర్మవీర్ మహాయోగి అనను గాని, గొప్ప యోగాచార్యుడని మాత్రం చెప్పగలను. త్యాగమే యోగమని భగవద్గీత చెబుతుంది. త్యాగం సన్యాసి లక్షణం. సన్యాసి కాకపోతే యోగి కాలేడు. ధర్మవీర్‌లో నేను కొన్ని సన్యాస లక్షణాలు కనుగొన్నాను. 

లోకం చిత్రమైంది. మనుషుల మనస్తత్వం విచిత్రమైంది. కొందరు తమతో సమానులంటే ఒప్పుకోరు. తమకంటే తక్కువవారంటే వారికి ష్టం. రాజకీయ రంగంలోనూ, సాహిత్యరం గంలోనూ, అల్పాధిక్యతను కల్గిన వారుంటారు. ఏ రంగంలో వున్నా ఒకరికొకరు గౌరవించడం మానవత్వం అనిపించుకుటుంది. నాకంటే వయస్సులో పెద్దవారైనా ధర్మవీర్ వారు యోగాచార్యులుగా సుప్రసిద్ధుడు. అలకాపురిలో వారి నివాసం.

ప్ర తిరోజూ వారు తమ శిష్యులతో యోగాసనాలు వేయిస్తారు. ఉపనిషత్తులను, దర్శ నాలను అధ్యయనం చేస్తూ, అక్కడక్కడ యజ్ఞ బ్రహ్మగా వ్యవహరిస్తారు. నాలుగేళ్ల క్రితం గురుపూర్ణిమ నాడు నన్ను ఆహ్వానించి, అలకాపురి యోగా కేంద్రంలో నా తో యోగం మీద ఉపన్యసింపజేశారు.

నేను పతంజలి యోగ శాస్త్రాన్ని గూర్చి మాట్లాడుతూ, దర్శన గ్రంథాల్లో యోగ దర్శనం విశిష్టమైనదని, అయితే, సాంఖ్యదర్శనం ‘థియరీ’ కాగా యోగదర్శనం ‘ప్రాక్టికల్’ అని తెలియజేశాను. కపిల మ హర్షి విరచితమైన సాంఖ్య దర్శనం ప్రకృతి పురుష వివేకాన్ని కలిగిస్తుంది. ప్రకృతి పురుషులకన్నా భేదం తెలియకపోతే యోగం సఫలం కాదు. కనుకనే నేనలా మాట్లాడాల్సి వచ్చింది.

ఆచార్యుడు నిత్య విద్యార్థి..

నా ప్రసంగాన్ని వందమంది వరకు విన్నారు. కానీ, వారిలో ఒక ఐదుగురిపై నా ప్రభావం పడింది. ఆ తర్వాత ఆ ఐదుగురు నా దగ్గరికి సాంఖ్య దర్శనం అధ్య యనం చేసేందుకు వచ్చారు. యోగ కుశలురైన ధర్మవీర్ తన శిష్యులను నా దగ్గరికి వెళ్లవలసినదిగా కోరారు. ఇక్కడ వారి సౌజన్యం తేటపడుతుంది. పోటీ పడడం తో పాటు అంతా తమకే తెలుసున్న అభిప్రాయంతో ఉందీ లోకం.

ధర్మవీర్ శిష్యు లట్లా నాకు శిష్యులయ్యారు. స్వాధ్యాయం అంటే ఇష్టపడే ధర్మవీర్ వారు తన శిష్యులతో పాటు మా ఇంటికి వచ్చి కొన్నాళ్లు వేదాంత దర్శనం కూడా చదువుకున్నారు. ‘ఆచార్యుడంటే నిత్య విద్యార్థి’ అనే మా టకు వారు నిదర్శనం. నేను పండిత గోపదేవుల దగ్గర యోగ విద్య నభ్యసించాను. వారు వాఖ్యానించిన యోగ దర్శనం సూక్ష్మంగా అనేక విషయాలను దర్శింపజేస్తుంది. ధర్మవీర్ ఆలోచనాపరులు.

యోగ దర్శనానికి విఫలమైన వ్యాఖ్యానం అవసరమని భావించి, దానికి సంబంధించిన గ్రంథం నాకు అందించారు. ఆ గ్రంథం ‘దర్శనయోగ ధామం’ సంస్థ ప్రచురించిన ‘యోగ దర్శనం’ వ్యాస భాష్యాన్ని అనుసరించి స్వామి సత్యవతి పరివ్రాజక్ హిందీ లో వ్యాఖ్యానించిన గ్రంథం. ధర్మవీర్‌కి స్వయంగా స్వామి సత్యవతి ఇచ్చిన గ్రం థం. సత్యవతి హైదరాబాద్‌కు ఎప్పుడు వచ్చినా ధర్మవీర్ గారింట్లోనే ఉండేవారు.

గొప్ప యోగాచార్యుడు..

యోగ దర్శనానికి తెలుగులో విపులమైన వ్యాఖ్య చేయాలన్న నా తలంపు నెరవేరడానికి ప్రోత్సహించిన చెక్కల వెంకటేశ్వర్లును, గ్రంథ సహాయం చేసిన ధర్మవీర్‌ను నేనెప్పుడూ మరువలేదు. కవులను తయా రు చేసే వారిని మహాకవులంటారు. ఋ షులను తయారు చేసే వారిని మహా గురువులంటారు. అలాగే యోగులను తయా రు చేసే వారు మహాయోగులు.

ధర్మవీర్ మహాయోగి అనను గాని, గొప్ప యోగాచార్యుడని మాత్రం చెప్పగలను. త్యాగమే యోగమని భగవద్గీత చెబుతుంది. త్యాగం సన్యాసి లక్షణం. సన్యాసి కాకపోతే యోగి కాలేడు. ధర్మవీర్‌లో నేను కొన్ని సన్యాస లక్షణాలు కనుగొన్నాను. ధర్మవీర్ తల్లిదండ్రులను దర్శనం చేసుకొని వేదానుగుణ మైన జీవితం గడుపుతున్న వారు ఎక్కడ యజ్ఞం జరుగుతుందని తెలిసినా అక్కడ వాలిపోతారు.

తెలంగాణలో ఉన్న వైదిక గురుకులాలకు ప్రియ బంధువు ఆయన. వేద గురుకులాలకు ప్రాణం పోసిన ధర్మవీరుడు గురుకులాల స్థాపనకు, అభివృద్ధికి భిక్షాటన చేసి సంపాదించిన ధనానికి, తన సొంత డబ్బులను జతచేసి లక్షల రూపాయలను గురుకులానికి వచ్చారు. 

దాతృత్వంలో మేటి..

ధర్మవీర్ వారి దాతృత్వానికి 1) వడ్లూరు ఆర్ష గురుకులం, 2) అల్యాబాద్ ఆర్ష కన్యా గురుకులం, 3) వైదిక కన్యా గురుకులం, 4) పిడిచెడ్  నిగమనీడం వేద గురుకులం, 5) దమ్మాయిగూడా పాణిని ప్రభావిత కన్యా గురుకులం, 6) వారణాసి  పాణిని కన్యా గురుకులం మొదలైనవి సాక్ష్యాలు. అలసట ను, అనారోగ్యాన్ని లెక్క చేయక ప్రతిక్షణాన్ని సుముహూర్తంగా లెక్కించి, వైదిక ధర్మ ప్రచారానికి తన జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు ధర్మవీర్.

వారు పతంజలి యోగ మార్గంలో ఎన్నో యోగ కేంద్రాలను ఏర్పాటు చేసి, వేలాది మందికి యోగ శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్‌లోని గాంధీ జ్ఞాన మందిర్ వంటి సంస్థలు ధర్మవీర్ ప్రోత్సాహంతోనే యోగ కేంద్రాలుగా మారాయి. ‘ఇం డియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (న్యూ ఢిల్లీ), ఇండియన్ ఇనిస్టిట్యూ ట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు) వంటి సంస్థల్లో ధర్మవీర్ యోగం మీద మాట్లాడి, ప్రయో గ పూర్వకంగా నిరూపించి శాస్త్రవేత్తల మన్ననలు సైతం పొందారు.

ధర్మవీర్ సేవలకు గాను హైదరాబాద్‌లో 2002లో ‘భగవాన్ ధన్వంతరీ సద్భావనా పురస్కారం’ లభించింది. 2012లో ‘చికిత్సా సేవా సద్భావనా శిరోమణి సన్మాన్’ బిరుదు లభించింది. 2015లో నిగమనీడమ్ వారి ‘ఆర్య భామాశాహ’ బిరుదు లభించింది. ధర్మవీర్ జీవనాన్ని ప్రాణప్రదంగా భావిస్తారు. మనిషికి కావాల్సింది ధనం కాదు, యోగం అని వారి నిశ్చితమైన అభిప్రాయం. యోగం కోసం తన ధనాన్ని వెచ్చించిన ధర్మవీర్ నిజంగా ధన్యులు.